Revanth Reddy: ప్రధానితో ఏం చర్చించారు.. ఏం కావాలని అడిగారు?
Revanth Reddy: ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో (narendra modi) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన సంభాషణ విశ్వసనీయ వర్గాల ద్వారా బయటికి వచ్చింది.
హైదరాబాద్‌కు ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), రాష్ట్రానికి ఒక సైనిక్ పాఠశాల కావాలని రేవంత్ కోరారట. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించి పెట్టుకున్న 11 అర్జీలపై కాస్త త్వరగా స్పందించి అనుమతులు జారీ చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఏపీ రికగ్నిషన్ యాక్ట్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వచ్చేలా చూడమని మోదీని కోరామని ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారని భట్టి తెలిపారు.
తెలంగాణలోని ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు జాతీయ గుర్తింపు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు మోదీ రేవంత్, భట్టిలకు తెలిపారు.