AP Elections: జ‌న‌సేన‌పై ఎటాక్.. TDPకి ఝ‌ల‌క్..!

AP: ఏపీ ఎన్నిక‌ల (ap elections) నేప‌థ్యంలో బ‌రిలో ఉన్న TDP, YCP, జ‌న‌సేన (janasena) పార్టీల ప్ర‌చారాలు ర‌సవ‌త్త‌రంగా ఉన్నాయి. ఓ వైపు అధికార పార్టీ YSRCP ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లానుకుంటోంది. మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన TDP నుంచి యువ‌గ‌ళం యాత్ర‌తో నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ఇక ఈసారైనా త‌మ సత్తా ఏంటో నిరూపించుకోవాల‌ని జ‌నసేన వారాహి యాత్రతో బిజీ బిజీగా ఉంది.

అయితే ఏపీ గ్రౌండ్ రిపోర్ట్ (ap ground report) చూసినట్లైతే.. వారాహి యాత్ర‌తో (varahi yatra) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి (pawan kalyan) ఫుల్ ప‌బ్లిసిటీ పెరిగిపోయింది. అఫ్‌కోర్స్ ఆయ‌న‌కు ప‌బ్లిసిటీ ప్ర‌త్యేకంగా అవ‌స‌రం లేద‌నుకోండి. కానీ ఫ్యాన్స్ కాని వారిలోనూ ప‌వ‌న్ క్రేజ్ ఇప్పుడు పెరిగింద‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణం YCP చేసే ఎటాక్సే. దాంతో కాపుల్లో (kapus) క‌సి పెరుగుతోంది. వారి అడుగులు జ‌న‌సేన (janasena) వైపు ప‌డుతున్నాయ‌ని చెప్పుకోవాలి. (ap elections)

ప‌వ‌న్ (pawan kalyan) YCP పాల‌న‌పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న‌ప్ప‌టికీ వాటికి స‌మాధానాలు చెప్ప‌లేక తిట్ల పురాణం మొద‌లుపెడుతున్నారు. ప‌వ‌న్ వారాహి యాత్ర‌ల్లో దేని గురించి మాట్లాడినా దానికి స‌మాధానం రావ‌డంలేదు. కానీ ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడ‌మంటే మాత్రం ప్ర‌తి ఒక్క YCP నేత ముందుంటున్నారు. అయితే ఇది కూడా YCP స్ట్రాటజీలో భాగమే అని YCP నేత‌లు అంటున్నారట‌. ఎందుకంటే పవన్‌ని పదే పదే టార్గెట్ చేయడం వల్ల ప్ర‌జ‌ల దృష్టి TDP నుంచి మళ్లుతుంది. (ap elections)

జ‌న‌సేన (janasena) అంటే ఇప్పుడిప్పుడు వ‌చ్చింది కానీ YCP ఎప్ప‌టినుంచో శ‌త్రువు అంటే అది TDPనే. అంటే ఈసారి ఎన్నిక‌ల్లో (ap elections) జ‌న‌సేనకు ఓట్లు ప‌డ‌వు కానీ జ‌న‌సేన వ‌ల్ల TDPకి ఎక్క‌డ ప‌డ‌తాయోన‌ని YCP నేత‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది. దాంతో ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తే ప్ర‌జ‌ల దృష్టి TDP వైపు నుంచి మ‌ళ్లుతుంది. దాంతో TDP ఎన్ని ప్ర‌చారాలు చేసినా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌ద‌ని మ‌ళ్లీ అధికారంలోకి తామే రావ‌చ్చ‌ని YCP ప్లాన్.

మ‌రోప‌క్క యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్నారు నారా లోకేష్‌ (nara lokesh). ఈ రోజుకి ఆయ‌న 2000 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసారు. అయితే ప‌వన్ (pawan kalyan) వారాహి యాత్ర పుణ్య‌మా అని లోకేష్ యాత్ర‌కు క్రేజ్ త‌గ్గిన‌ట్లు ఏపీ గ్రౌండ్ రిపోర్టులు (ground report) చెప్తున్నాయి. అయితే TDP గ్రాఫ్ బెట‌ర్‌గానే ఉంది కానీ జ‌న‌సేన‌ (janasena), BJPతో పొత్తు లేక‌పోతే మాత్రం 40 సీట్లు (ap elections) రావ‌డం కూడా క‌ష్ట‌మే అని తెలుస్తోంది. ఇప్ప‌టికే పొత్తు (alliance) కన్ఫామ్ అయిన‌ట్లు తెలుస్తోంది కానీ BJP మాత్రం ఏ ఒక్క పార్టీతో క‌ల‌వ‌న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తోంది. పోనీ పొత్తులు వ‌ద్దు ఏమీ వ‌ద్దు ఒంటరిగా బ‌రిలోకి దిగితే మాత్రం మ‌ళ్లీ జ‌గ‌నే (ap cm jagan) అధికారంలోకి వ‌స్తార‌ని తెలుస్తోంది.