Kavitha: రామ మందిరంపై కవిత ట్వీట్.. సెడన్‌గా ఈ మార్పేంటి?
Kalvakuntla Kavitha: కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అయోధ్య రామమందిరం (ram mandir) జనవరి కల్లా సిద్ధం కాబోతోంది. భారతదేశ కోట్లాది మంది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రామమందిర దర్శనానికి ఇంకా కొంత సమయమే ఉంది.
అయితే ఇదే రామ మందిరం గురించి ఓ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. ఓట్ల కోసం రాజకీయాల కోసం రామ మందిరాన్ని వాడుకుంటున్నారని.. ఇలాంటి నీచపు మత రాజకీయాలకు ఇంకెళ్లు కొనసాగుతాయని అన్నారు. అలాంటి కవిత.. ఉన్నట్టుండి రామ మందిరం నిర్మాణంపై ట్వీట్ చేసారు. శుభ పరిణామం..అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో…తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అని ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ఎన్నికల ముందు వరకు అసలు రామ మందిరం గురించి మాట్లాడని కవిత సడెన్‌గా ఎందుకు ఇలా ట్వీట్ చేసారా అన్న చర్చ మొదలైంది. ఇది రాజకీయ అంశంగా ఎందుకు పరిగణిస్తున్నారంటే రామమందిరం నిర్మించాలన్నది BJP మేనిఫెస్టోలో 2018లోనే ప్రకటించింది. ఇప్పుడు రామ మందిరం నిర్మితం అవుతోందంటే అది BJP తీసుకున్న చొరవే.
అలాంటి BJP చేపడుతున్న రామ మందిర నిర్మాణంపై కవిత ఎందుకు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు? ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (delhi liquor scam) కవిత పేరు బయటికి వచ్చినప్పటికీ కవితను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే చర్యలు తీసుకోలేదని.. ఆ కేసులో భాగమైన వారందిరనీ జైలులో ఉంచారని కాంగ్రెస్ (congress) ఆరోపించింది.
BJP, BRS రెండూ ఒక్కటే అని చెప్పడానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకపోవడమే నిదర్శనం అన్న అంశాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక ఇటీవల సుప్రీంకోర్టు లిక్కర్ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కవిత తప్పించుకోవడానికి ప్రభుత్వం కూడా BRS అధికారంలో లేదు. అదీకాకుండా..BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతి చిట్టాను కాంగ్రెస్ బయటపెట్టే పనిలో ఉంది. వీటి అన్నింటి నుంచి తప్పించుకునేందుకు కవిత BJP చేపడుతున్న రామమందిర నిర్మాణాన్ని పొగుడుతున్నారు అంటూ పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.