G20 Summit: ఆ మంత్రమే మనల్ని నడిపించేది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో G20 సమ్మిట్ (g20 summit) అట్టహాసంగా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని కోసం కేటాయించిన టేబుల్‌పై ఉన్న నేమ్ ప్లేట్‌పై ఇండియా అని కాకుండా భారత్ అని రాసి ఉండటం హైలైట్‌గా నిలిచింది. అనంతరం మోదీ అన్ని దేశాల నేతలను ఉద్దేశిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రపంచ సమస్యలపై పోరాడేందుకు ఈ 21వ శతాబ్దం ఎంతో కీలకమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రజల అవసరాలేంటో తెలుసుకుని వాటిపై ఫోకస్ చేస్తూ పనిచేయాలని అప్పుడే వారి నమ్మకం మనపై ఉంటాయని అన్నారు. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం కారణంగా కొన్ని దేశాల మధ్య సత్సంబంధం, నమ్మకం లేకుండాపోయిందని జీ20 సమ్మిట్‌లో భాగమైన దేశాలన్నీ కలిసి పనిచేసి మళ్లీ ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే మంత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుందని తెలిపారు. (g20 summit)
ఆహారం, ఎనర్జీ, భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భావితరాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలంటే అన్ని దేశాలు కలిసి పనిచేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ముఖ్యమైన ప్రకటన చేసారు. ఆఫ్రికన్ దేశానికి జీ20 సమ్మిట్ చిరకాల సభ్యత్వం ఉంటుందని వెల్లడించారు. ఆ దేశానికి కూడా సమ్మిట్‌లో ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంటుందని తెలిపారు. దాదాపు ఏడాదిగా G20 సమిట్‌లో భాగంగా సమావేశాలు ఇండియాలోనే జరుగుతున్నాయి. 30 దేశాలకు చెందిన నేతలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి.
భూకంప బాధితులకు నివాళులు
మొరాకో దేశంలోని మారాకాష్ (morocco earthquake) ప్రాంతంలో ఈరోజు ఉదయం సంభవించిన భారీ భూకంపంలో దాదాపు 700 మంది మృత్యువాతపడ్డారు. జీ20 సమ్మిట్ సమావేశంలో ప్రసంగానికి ముందు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొరాకో దేశానికి ఏ సాయం కావాలన్నా ఈ సమయంలో భారత్ అండగా ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. (g20 summit)