Supreme Court నిర్ణయం వెనక కారణాలు
Delhi: మొత్తానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (rahul gandhi) సర్వోన్నత న్యాయస్థానంలో (supreme court) ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు కేసులో భాగంగా గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా కోల్పోయారు. ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ పెట్టుకుంటే తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. దాంతో ఇక రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ మనో సింఘ్వి చేసిన వాదనలు విన్న సుప్రీంకోర్టు జడ్జిలు.. రాహుల్‌కి సూరత్ కోర్టు వేసిన శిక్షపై స్టే విధించారు. (supreme court)
సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంది?
రాహుల్‌కి వేసిన శిక్షపై సుప్రీంకోర్టు (supreme court) స్టే విధించాలన్న నిర్ణయం ఎలా తీసుకుందో తెలుసుకుందాం. రాహుల్‌కి రెండేళ్లు జైలు శిక్ష విధించిన ట్రయల్ కోర్టు (సూరత్ కోర్టు) అసలు ఎందుకు అంత శిక్ష వేసిందో సరైన కారణాలు చెప్పలేదు. ఇది రాహుల్ కేసును వాదించడానికి ప్లస్ పాయింట్ అయింది. పైగా ట్రయల్ కోర్టు ప్రత్యేకించి ఈ కేసులో ఇచ్చిన తీర్పు వల్ల రాహుల్ తన రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడమే కాక పబ్లిక్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయిందని తెలిపింది. శిక్షపై స్టే విధించినంత మాత్రాన రాహుల్ పబ్లిక్ మీటింగులలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని, ఏం మాట్లాడినా ఆచి తూచి వ్యవహరించాలని మందలించింది.
సరైన పాయింట్ పట్టుకున్న లాయర్
రాహుల్ తరఫున వాదించిన లాయర్ అభిషేక్ సింఘ్వి సరైన పాయింట్‌పై జడ్జిల ముందు వాదనలు వినిపించారు. రాహుల్‌పై మొదట కేసు వేసిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (purnesh modi) అసలు పేరు మోదీ కానేకాదని, ఎమ్మెల్యే అవ్వడానికి ముందు ఆయన మోదీ పేరును తగిలించుకున్నారని సింఘ్వి కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు అతను రాహుల్‌పై వేసిన కేసు చెల్లదని, పూర్ణేశ్ కాకుండా మోదీ పేరున్న మరో వ్యక్తి ఎవ్వరూ కూడా రాహుల్‌పై కేసు పెట్టలేదని వాదనలు వినిపించారు. “ విచిత్రం ఏంటంటే.. మోదీ పేరున్నవారు 13 కోట్ల మంది. వారిలో కేవలం BJPకి చెందినవారే రాహుల్‌పై కేసులు ఎలా పెడతారు? రాహుల్‌పై మొత్తం 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. వాటిలో ఒక్కటి కూడా సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయారు. రెండేళ్లు జైలు శిక్ష విధించడానికి ఇదేమీ మర్డర్, రేప్, కిడ్నాప్ కేసు కాదు కదా. ఇలాంటి వ్యాఖ్యలపై రెండేళ్లు జైలు శిక్ష విధించిన దాఖలాలు గతంలో లేనేలేవు ” అని సింఘ్వి తన వాదనలు వినిపించడంతో రాహుల్‌కు ఊరట లభించింది.
స్టే విధించడం వల్ల రాహుల్‌కి లాభమేంటి?
ఇక సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది కాబట్టి రాహుల్‌కి (rahul gandhi) రాజ్యసభ సభ్యత్వం మళ్లీ లభిస్తుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (lok sabha elections) రాహుల్ తన నియోజకవర్గమైన వాయనాడ్ (wayanad) నుంచి పోటీ చేసుకునేందుకు అవకాశం ఉంది.