Afghanistan: భారత్‌లో ఎందుకు కార్యకలాపాలు ఆపేసింది?
భారత్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ (afghanistan) దౌత్యకార్యాలయంలోని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు అఫ్గానిస్థాన్‌లో సరైన ప్రభుత్వం అనేదే లేదు. దానిని ఉగ్రవాదులు ఆక్రమించుకుని వారికి నచ్చినట్లు రూల్స్ పెట్టుకుంటున్నారు. మనం ఆ ఉగ్రవాద దేశంతో ఎలాంటి సత్సంబంధాలు పెట్టుకోకపోయినప్పటికీ ఇక్కడున్న అధికారులు ఆ దేశం కోసం పనిచేస్తున్నారు. వారి పనిలో వారున్నారు కదా అని భారత్ కూడా కలగజేసుకోలేదు. ఇప్పుడు అసలు అఫ్గాన్ ఇక్కడి దౌత్య కార్యకలాపాలను ఎందుకు నిలిపివేసిందో తెలుసుకుందాం.
*ఇక్కడి అఫ్గాన్ దౌత్యకార్యాలయానికి భారత్ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని అందుకే కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆ దేశం ప్రకటించింది. అందులో ఎంత వరకు నిజం ఉందనేది మన ప్రభుత్వం వెల్లడించాలి. (afghanistan)
*భారత్ ఏ విధంగానూ అఫ్గాన్‌కి కానీ అక్కడి ప్రజలకు కానీ ఉపయోగపడే పనులు ఎప్పుడూ చేయలేదని ఆరోపించింది. ఉగ్రవాదులు ఆక్రమించుకున్న దేశానికి ఏ రకంగా సాయంపడతామని అనుకున్నారో వారికే తెలియాలి.
*ఎంబసీలో విధులు నిర్వహించడానికి స్టాఫ్ లేకపోవడంతో కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని అఫ్గాన్ ప్రకటించింది. వీసా రెన్యూవల్స్ చేసేందుకు కూడా స్టాఫ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. (afghanistan)
ఏది ఏమైనప్పటికీ భారత్ అసలు అఫ్గాన్ విషయంలో తలదూర్చలేదు. కాకపోతే 2020లో అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని భారత్‌లో ఒక దౌత్యకార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఓ అంబాసిడర్‌ను, సిబ్బందిని కేటాయించడంతో భారత్ కూడా ఏమీ అనలేదు. కానీ 2021లో ఉగ్రవాదులు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అష్రఫ్ వేరే దేశానికి పారిపోయాడు. దాంతో ఇక్కడి అఫ్గాన్ ఎంబసీని పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. ఇక భారత్ కూడా ఈ విషయంలో కలగజేసుకోలేదు. ఇప్పుడు అఫ్గాన్ ఇక్కడి ఎంబసీని మూసివేసినంత మాత్రాన భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు.