Kodali Nani: ఆధారాలున్నాయో లేదో ప‌వ‌న్‌కి ఎలా తెలుసు?

స్కిల్ సాఫ్ట్ స్కాంలో ఏ ఆధారాలున్నాయ‌ని చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) అరెస్ట్ చేసార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప్ర‌శ్నించ‌డంపై స్పందించారు కొడాలి నాని (kodali nani). ఆధారాలు ఉన్నాయో లేవో ప‌వ‌న్‌కి ఎలా తెలుస్తుంద‌ని.. ఆధారాలు ఉన్న‌ప్పుడు కోర్టులో జ‌డ్జి ప‌రిశీలిస్తారు కానీ ప‌వన్‌కి ఎందుకు ఇవ‌న్నీ అని అన్నారు. స్కాంతో చంద్ర‌బాబుకు సంబంధం లేదంటే మ‌రి ఎవ‌రికి ఉన్న‌ట్లు అని ప్ర‌శ్నించారు. ఎప్ప‌టినుంచో ఆధారాలున్నాయి అన్న‌ప్పుడు అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని చాలా మంది అడుగుతున్నార‌ని.. వెంట‌నే అరెస్ట్ చేస్తే క‌క్ష సాధింపు అంటార‌ని మండిప‌డ్డారు. నిదానంగా ప‌రిశీలించాకే చ‌ర్య‌లు తీసుకోవాల‌నుకున్నామే కానీ ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాద‌ని నాని తెలిపారు. (kodali nani)

ప‌వ‌న్‌కి ఏం తెలుసు?

ప‌వ‌న్ ఆధారాలున్నాయా అని అడుగుతున్నాడు. ప‌వ‌న్‌కి ఎలా తెలుసు ఆధారాలున్నాయో లేవో అని. అస‌లు ఆధారాల‌తో ఆయ‌న‌కేం ప‌ని. ప‌వ‌న్ ప్యాకేజ్ తీసుకుంటాడ‌ని అంటారు. మ‌రి ఆధారాలు ఉన్నాయా? ప‌వ‌న్ వారాహి వ్యాన్‌కు చంద్ర‌బాబు పెట్రోల్ కొట్టిస్తాడు. లేక‌పోతే అది క‌ద‌ల‌దు. దానికి ఆధారాలు ఉన్నాయా? ద‌త్త‌పుత్రుడు కాబట్టి తండ్రి అరెస్ట్‌ను త‌ట్టుకోలేక బాధ‌లో అలా మాట్లాడుతున్నాడు అని నాని తెలిపారు. (kodali nani)