AP Elections: జైల్లో ఉన్న‌ప్పుడు తోడున్న నేత‌లు ఇప్పుడెందుకు ఇలా?

AP Elections: ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) టికెట్ ఇవ్వ‌రేమో అని అప్పుడే వ‌ల‌స‌పోతున్నారు YSRCP నేత‌లు. టికెట్ ఉంటేనే పార్టీలో ఉంటారా? లేదంటే పార్టీ అవ‌స‌రం లేదా? అక్ర‌మ ఆస్తుల కేసులో జ‌గ‌న్ దాదాపు 16 నెల‌ల పాటు జైల్లో ఉన్న‌ప్పుడే పార్టీని వెంట‌పెట్టుకుని ఉన్నారే.. మ‌రి ఇప్పుడు ఆధిక్యంతో గెలిచి.. అధికారంలో ఉండి కూడా ఎందుకు పార్టీని అంటిపెట్టుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు? దీనికి చాలానే కార‌ణాలు ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి, పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌, అధినాయ‌క‌త్వంపై తిరుగుబాటు, అధినేత వైఖ‌రి.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ బాధ్య‌త మాత్రం జ‌గ‌న్‌దే క‌దా..!