Atiq ahmed: యూపీ రక్తసిక్తం.. అసలు ఎవరీ అతీక్ అహ్మద్
Lucknow: మర్డర్లు, ఎన్‌కౌంటర్లతో(atiq ahmed) ఉత్తర్‌ప్రదేశ్ రక్తసిక్తంగా మారింది. రాష్ట్రం(uttarpradesh) ప్రస్తుతం హైఅలర్ట్‌లో ఉంది. నిన్న దారుణ హత్యకు గురైన అతీక్ అహ్మద్(atiq ahmed) అసలు కథేంటి?
అతీక్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రవాస్తిలో 1962లో పుట్టాడు. ఇతనికి ఐదుగురు కొడుకులు. మొన్న ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదు కొడుకుల్లో ఒకరైన అసద్(asad) చనిపోయాడు.. 1989లో అతీక్(atiq) రాజకీయ ప్రయాణం మొదలైంది. ప్రయాగ్‌రాజ్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు.
మూడేళ్ల తర్వాత సమాజ్‌వాది పార్టీ(samajwadi party) నుంచి బయటికి వచ్చి అప్నా దళ్ అనే సంస్థకు ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచాడు. 2003లో మళ్లీ సమాజ్‌వాది గూటికి చేరాడు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించాడు. 40 ఏళ్లలో అతీక్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. భూకబ్జాలు, మర్డర్లు, దోపిడీలు, కిడ్నాప్‌లు ఇలా ఎన్నో కేసుల్లో అతీక్ నిందితుడిగా ఉన్నాడు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో అతీక్ ప్రధాన నిందితుడు.
తన అన్న ఖలీద్ అజీమ్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచాడని అతీక్ రాజు పాల్‌ను చంపించేసాడు. రాజు పాల్ మర్డర్ కేసులో ఉమేష్ పాల్ ప్రత్యక్ష సాక్షి. దాంతో అతన్ని కిడ్నాప్ చేయించాడు. రాజు పాల్‌ను చంపడం అసలు తను చూడలేదని లేఖ రాసి సంతకం పెట్టాలని అతీక్ బలవంతం చేసాడు. దాంతో అతీక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా జీవితఖైదు శిక్ష వేసింది. ఈ నేపథ్యంలో అతీక్‌ను నిన్న వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వరుస కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతీక్, అతని సోదరుడు ఖలీద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ ఇద్దరు దుండగులు పోలీసులకు లొంగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.