Rajagopal Reddy: అందుకే BJP టికెట్ ఇవ్వలేదా?
Telangana Elections: తెలంగాణలోనే రిచెస్ట్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (rajagopal reddy) ఈసారి BJP గట్టి షాక్ ఇచ్చింది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో మునుగోడు, ఎల్బీనగర్ టికెట్ ఆశించిన రాజగోపాల్ రెడ్డికి BJP మొండిచేయి చూపించింది. కాంగ్రెస్ పార్టీ (congress) ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేయడంతో BJPలో చేరారు.
ఆ తర్వాత BJP రాజగోపాల్ రెడ్డిపై నమ్మకంతో మునుగోడు (munugode) ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పింది. రాజగోపాల్ రెడ్డి కేవలం 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇది మెచ్చుకోదగ్గ అంశమనే చెప్పాలి. కానీ ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారు, ఓడారు అన్నది ఇక్కడ పాయింట్ కాదుగా..! గెలిచారా ఓడిపోయారా అనేదే చూస్తారు. రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. కాంగ్రెస్‌ను వదిలేసి భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు ప్రతిపక్ష పార్టీ BRSని ఓడిస్తాడు అనుకుంటే అలా జరగలేదు. ఇక్కడ BJPకి ఒళ్లు మండింది. (rajagopal reddy)
దూరం పెట్టిన BJP
మునుగోడు ఉప ఎన్నికలు అయ్యాక దాదాపు ఆరు నెలల పాటు BJP రాజగోపాల్ రెడ్డిని దూరం పెట్టింది. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయాక కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడలేదు. అంతేకాదు.. రాజగోపాల్ రెడ్డి ఎదుగుదల చూసి ఇదే పార్టీలోని కొందరు నేతలు ఆయన గురించి హైకమాండ్‌కు చాడీలు చెప్పారట. అందుకే పార్టీ ఆయన్ను పక్కనపెట్టింది. ఎవరో చెప్పింది హైకమాండ్ విన్నప్పుడు రాజగోపాల్ సైడ్ నుంచి కూడా వినాల్సింది. కానీ అలా చేయలేదు. వారు చెప్పిన చాడీలనే హైకమాండ్ నమ్మింది. అందుకే ఇప్పుడు BJP ప్రకటించిన తొలి అభ్యర్ధుల జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు లేదు. (rajagopal reddy)
మళ్లీ వస్తానంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?
ఒకసారి పార్టీ నుంచి వెళ్లిపోయాక మళ్లీ వస్తానంటే ఏ పార్టీ అయినా వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం. కాబట్టి సీనియర్ నేతలు పార్టీకి ఎంతో అవసరం. రేపు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి మళ్లీ రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరుతారని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అటు ఎల్బీ నగర్, ఇటు మునుగోడు నుంచి పోటీ చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు. మరి దీనికి కాంగ్రెస్ హైకమాండ్ ఏమంటుందో చూడాలి.
అప్పుడు పట్టించుకోలేదు మరి ఇప్పుడు?
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనను కానీ తన ఆలోచనా విధానాన్ని కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం తనకు లేదు కాబట్టే BJPలో చేరానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు BJP తనకు టికెట్ ఇవ్వలేదని మళ్లీ కాంగ్రెస్‌లో చేరతానంటున్నారు. ఆనాడు పట్టించుకోని కాంగ్రెస్ మరి ఇప్పుడెందుకు పట్టించుకుంటుందని రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నారో ఆయనే చెప్పాలి.
రేవంత్ రెడ్డితో పోరు
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి (revanth reddy) అంటే ఆయనకు గిట్టదు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatirddy venkat reddy) రేవంత్ రెడ్డి మంచి మిత్రులు. కానీ ఆ స్నేహం రాజగోపాల్ రెడ్డి, రేవంత్ మధ్య లేదు. ఇందుకు కారణం రేవంత్ డబ్బులు ఇచ్చుకుని PCC అధ్యక్ష పదవి తీసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ రేవంత్‌ను రాజగోపాల్ రెడ్డి ఒక లీడర్‌గా చూడటంలేదు. మరి కాంగ్రెస్‌లో చేరాలంటే రాహల్ అందరి కంటే ముందు రేవంత్ అభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం ఇస్తారని టాక్. మరి రేవంత్ అంటే గిట్టనప్పుడు మళ్లీ అతను ఉన్న పార్టీలోకే రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అర్థంకావడంలేదు. బహుశా రాజకీయాల్లోని మ్యాజిక్ ఇదేనేమో…! (rajagopal reddy)