EXCLUSIVE: నాతో వ‌చ్చేదెవ‌రు?

EXCLUSIVE: విజ‌య‌వాడ TDP మాజీ ఎంపీ కేశినేని నానిని (kesineni nani) తెలుగు దేశం పార్టీ దూరం పెట్ట‌డంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేసారు. త్వ‌ర‌లో YSRCPలో చేరే అవ‌కాశం కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒక్క‌డే కాకుండా మ‌రికొంద‌రు తెలుగు దేశం పార్టీ నేత‌ల‌ను కూడా వెంటపెట్టుకుని YSRCPలో చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలో 60 శాతం తెలుగు దేశం పార్టీని ఖాళీ చేస్తాన‌ని నాని ఛాలెంజ్ విసిరారు. తిరువూరు, మైల‌వ‌రం, నందిగామ‌లో నానికి బల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఇప్ప‌టికే తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ నానికే స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న చూపు YSRCP పార్టీ వైపే ఉంది. మ‌రోప‌క్క నాని అనుచ‌రులు బొమ్మ‌సాని, ఎంఎస్ బేగ్ నారా లోకేష్‌ను క‌లిసారు. వారిద్ద‌రూ తెలుగు దేశం పార్టీలోనే ఉంటామ‌ని లోకేష్‌కు తెలిపారు.