EXCLUSIVE: ఇలాగైతే పదేళ్లు కాదు పది నెలలు కూడా ఉండలేరు
EXCLUSIVE: తెలుగు దేశం పార్టీతో (TDP) మరో పదేళ్లు పొత్తు ఇలాగే కొనసాగాలని జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఓ సందర్భంలో అన్నారు. ప్రస్తుతం చూస్తున్న పరిణామాలను బట్టి పదేళ్లు కాదు కదా పది నెలలు కూడా తెలుగు దేశం, జనసేన (janasena) పార్టీల పొత్తు నిలవదేమో అనిపిస్తోంది.
పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు ఉల్లంఘించారని పవన్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేసారు. ఆయన ఉల్లంఘించినప్పుడు తాను ఉల్లంఘిస్తే తప్పేంటి అన్నట్లు రాజోలు, రాజా నగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేసారు. మరోపక్క నాగబాబు (nagababu) కూడా తెలుగు దేశం పార్టీపై పరోక్షంగా సెటైర్ వేసారు. ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని ఆయన ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇలాగే కొనసాగితే ఎన్నికల తేదీ ప్రకటించక ముందే పార్టీలు విడిపోతాయేమో అనే పరిస్థితి నెలకొంది.