Nitish Kumar ను చుట్టుముట్టిన వివాదం ఏంటి.. అంత దారుణంగా ఏం మాట్లాడారు?
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) వివాదంలో ఇరుక్కున్నారు. సొంత పార్టీ నేతలు కూడా సపోర్ట్ చేయలేని ఇబ్బందిలో పడ్డారాయన. ఇంతకీ నితీష్ కుమార్‌పై ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు ఆయన బిహార్ అసెంబ్లీలో ఏమన్నారు?
బిహార్‌లో ఇటీవల కుల గణన సర్వే (caste census) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సర్వేలోనే బిహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 2.9కు చేరిందని తెలిసింది. అయితే దీని గురించి నితీష్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆడవారు చదువుకుంటే పిల్లల్ని కనకుండా తమ భర్తలను కంట్రోల్ చేయొచ్చని కాస్త పచ్చిగా చేత్తో సైగలు చేస్తూ మాట్లాడారు. పెళ్లవ్వగానే పిల్లల్ని కనాలపి భర్తలే ఆడవారిని ప్రేరేపిస్తుంటారని.. వారిని కంట్రోల్ చేయాలంటే మహిళలు చదువుకోవాలని అన్నారు. (nitish kumar)
దాంతో అసెంబ్లీలో పెద్ద గొడవ మొదలైంది. అసలు నితీష్ ఇంత నీచానికి ఎలా దిగజారతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆయన అసలు రాజకీయాలకు అర్హుడు కాడని వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో నితీష్ కుమార్ క్షమాపణలు కోరారు. ఆడవారికి చదువు అనేది ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకున్నానే కానీ ఎవ్వరినీ తక్కువ చేసి చూడాలని కాదని వివరణ ఇచ్చారు. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఊరుకోవడంలేదు.
అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని అక్కడ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని AIMIM చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ (asaduddin owaisi) కూడా అభిప్రాయపడ్డారు. ఆడవారికి చదువు ఎంతో ముఖ్యం అని చెప్తే సరిపోయేదని ఆ మాత్రం దానికి పచ్చిగా ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం ఏముందని అన్నారు. నితీష్ కుమార్‌కి బి గ్రేడ్ సినిమాలు చూసి పిచ్చెక్కిందని BJP నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. (nitish kumar)