KTR: BRS షాడో క్యాబినెట్.. అంటే ఏంటి?

KTR: త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో తెలంగాణ రాష్ట్రానికి BRS పార్టీ ఎంత చేసిందో వెల్ల‌డిస్తూ BRS ఎమ్మెల్యే KTR స్వేద ప‌త్రాన్ని విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంలో ఆయ‌న ఒక మాట‌న్నారు. ఇప్పుడు ఆ మాట రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చకు దారి తీసింది. ఇంత‌కీ ఆ మాట ఏంటంటే.. షాడో క్యాబినేట్. తెలంగాణ‌లో మంత్రుల‌తో కూడిన ఓ క్యాబినెట్ ఉంటుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆ క్యాబినెట్‌లో గెలిచిన పార్టీ నేత‌లు ఉంటారు. కానీ షాడో క్యాబినెట్ అనేది ఈ దేశంలోని ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటుచేయ‌లేదు.

ఏంటీ షాడో క్యాబినెట్?

ఇది విదేశాల్లో అమ‌ల్లో ఉంది. షాడో అంటే నీడ‌. అంటే అధికారంలో ఉన్న క్యాబినెట్‌తో పాటే వారు ప్ర‌జ‌ల‌కు ఏమేం చేస్తున్నారో ఏం చేయ‌డంలేదో తెలుసుకునేందుకు ప్ర‌త్య‌ర్ధి పార్టీ కొంద‌రిని నియ‌మిస్తుంది. వారి నుంచి డేటా మొత్తం బ‌య‌టికి తీస్తుంది. ఈ షాడో క్యాబినెట్ ద్వారా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం చేస్తున్న‌వ‌న్నీ బ‌య‌టికి వ‌స్తాయి. అయితే కొన్ని కాన్ఫిడెన్షియ‌ల్ అంశాల‌ను మాత్రం బ‌య‌టికి చెప్ప‌రు.

దీనిని పార్టీ తెలంగాణ‌లో తొలిసారి అమ‌లు చేయ‌నుంద‌ని KTR తెలిపారు. ఒక‌వేళ అదే జ‌రిగితే దేశంలోనే షాడో క్యాబినెట్‌ను ఏర్పాటుచేసిన ఏకైక పార్టీ BRS అవుతుంది. షాడో క్యాబినెట్‌లో ఉన్న మంత్రిని షాడో మినిస్ట‌ర్ అని సంబోధిస్తారు. ఇప్ప‌టికైతే ఈ షాడో క్యాబినెట్ యూకే పార్ల‌మెంట్‌లో అమ‌ల్లో ఉంది. షాడో క్యాబినెట్‌ను షాడో ప్ర‌భుత్వం, క్రిప్టోక్ర‌సీ, సీక్రెట్ గ‌వ‌ర్న‌మెంట్, ఇన్‌విజిబుల్ గ‌వ‌ర్న‌మెంట్ అని కూడా పిలుస్తారు.