House Arrest: అంటే ఏంటి.. ఎవ‌రికి వ‌ర్తిస్తుంది?

మ‌న భార‌తీయ న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో హౌస్ అరెస్ట్‌లు (house arrest) అనేవి అత్యంత అరుదుగా జ‌రుగుతుంటాయి. హౌస్ అరెస్ట్ అంటే ఒక వ్య‌క్తి జ్యూడిషియ‌ల్ లేదా పోలీస్ క‌స్ట‌డీలో ఉంటే అత‌న్ని జైలులో కాకుండా ఇంట్లోనే అరెస్ట్ చేసి ఉంచ‌డాన్ని హౌస్ అరెస్ట్ అంటారు. (chandrababu arrest)

అయితే ఈ హౌస్ అరెస్ట్ అనేది అంద‌రికీ వ‌ర్తించ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు.. TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు కేసు విష‌యంలో హౌస్ అరెస్ట్ కోసం పిటిష‌న్ వేస్తే దానిని ACB కోర్టు తిర‌స్క‌రించింది. ఎందుకంటే.. ఆ వ్యక్తి మొద‌టిసారి అరెస్ట్ అయ్యి.. వారి వ‌ల్ల స‌మాజానికి కానీ ఇత‌రుల‌కు కానీ ఎలాంటి హాని పొంచి లేద‌ని న్యాయ‌స్థానానికి అనిపిస్తేనే ఈ హౌస్ అరెస్ట్‌కు అనుమ‌తి ఇస్తారు. అంతేకాదు.. హౌస్ అరెస్ట్ పిటిష‌న్‌లో ప్ర‌స్తావించే అంశాలు న్యాయ‌మూర్తికి క‌న్విన్సింగ్‌గా అనిపించాలి. ఒక‌వేళ హౌస్ అరెస్ట్‌కు అనుమ‌తి ఇస్తే.. ఆ వ్య‌క్తిని ప్ర‌తిక్ష‌ణం క‌నిపెట్టుకుని ఉండ‌టానికి ఎలక్ట్రానిక్ ప‌రిక‌రాన్ని అమ‌రుస్తారు. ఈ బ్రేస్లెట్‌కు GPS క‌నెక్ట్ అయివుంటుంది. (house arrest)

హౌస్ అరెస్ట్ అయితే బ‌య‌టికి వెళ్ల‌కూడ‌దా?

అలాగని ఏమీలేదు. కానీ కోర్టు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తుందో అక్కడి వ‌ర‌కే వెళ్లాలి. డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్స్, ప్రొబేష‌న్ ఆఫీస‌ర్ల ద‌గ్గ‌రికి, అలాగే స్కూల్స్ కాలేజీల వ‌ర‌కు వెళ్ల‌చ్చు. కాక‌పోతే ఊరు దాటి మాత్రం వెళ్ల‌డానికి ఉండ‌దు.

యాంకిల్ బ్రేస్లెట్

హౌస్ అరెస్ట్ అయిన వారికి ప్ర‌త్యేకంగా కాలికి ఓ బ్రేస్లెట్ ఇస్తారు. ఆ బ్రేస్లెట్‌ను ఎప్పుడూ ధ‌రించే ఉండాలి. ఈ బ్రేస్లెట్ రూల్ అనేది అమెరికాలో వ‌ర్తిస్తుంది. ఈ విష‌యంలో అన్ని దేశాల్లో ఒకే విధానం ఉండ‌దు. (house arrest)

ప్రొబేష‌న్ ఆఫీస‌ర్

హౌస్ అరెస్ట్ అయిన వ్యక్తి ఇంట్లో కోర్టు త‌ప్ప‌కుండా ఒక ప్రొబేష‌న్ ఆఫీస‌ర్‌ను నియ‌మిస్తుంది. అత‌ను 24 గంట‌లూ నిందితుడిని క‌నిపెట్టుకుని ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి.

నో ఆల్క‌హాల్

హౌస్ అరెస్ట్‌లో ఉన్న వ్య‌క్తి అస‌లు మ‌ద్యం, డ్ర‌గ్స్ వంటివి తీసుకోకూడ‌దు. కోర్టు, అధికారుల క‌ళ్లు క‌ప్పి ఇలాంటి ప‌నులు చేస్తే మ‌రుక్ష‌ణం హౌస్ అరెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. సడెన్‌గా ప్రొబేష‌న్ అధికారి డ్ర‌గ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఈ టెస్ట్ ఎప్పుడు చేయాల‌నుకున్నా హౌస్ అరెస్ట్‌లో ఉన్న వ్య‌క్తి సిద్ధంగా ఉండాలి.

ఈవెనింగ్ క‌ర్ఫ్యూ

అంటే సాయంత్రం స‌మ‌యంలో ఎంత ముఖ్య‌మైన ప‌నులు ఉన్నా కూడా హౌస్ అరెస్ట్‌లో ఉన్న వ్య‌క్తి బ‌య‌ట అడుగుపెట్ట‌డానికి వీల్లేదు. అనారోగ్య స‌మ‌స్య‌లు వంటివి వ‌స్తే ప్రొబేష‌న్ అధికారే ద‌గ్గ‌రుండి హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తారు. ఎమ‌ర్జెన్సీ కాక‌పోతే వైద్యుల‌నే ఇంటికి పిలిపిస్తారు.

ఎంత కాలం హౌస్ అరెస్ట్‌లో ఉంచుతారు?

ఒక వ్య‌క్తిని దాదాపు సంవ‌త్స‌రం పాటు హౌస్ అరెస్ట్‌లో ఉంచే అవ‌కాశం ఉంటుంది. ఎన్ని రోజులు అనేది ఆ వ్య‌క్తి చేసిన నేరాన్ని బ‌ట్జి కోర్టు డిసైడ్ చేస్తుంది. (house arrest)