Kerala: గవర్నర్‌పై సీఎంకు కోపమా.. కేరళలో ఏం జరుగుతోంది?
Kerala: కేరళలో రాజకీయ రణరంగం చోటుచేసుకుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. (pinarayi vijayan) గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను (arif mohammad khan) గాయపరచాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని ఆరిఫ్ మీడియా ముందు చెప్పడంతో సంచలనంగా మారింది. గవర్నర్ ఆరిఫ్ ఢిల్లీ వెళ్లేందుకు తిరువంతపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా CPI(M)కు చెందిన విద్యార్ధుల సంఘం ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
ఆ విద్యార్ధులు తనను గాయపరచాలని చూసారని దీని వెనుక పినరయి విజయన్ హస్తం ఉందని ఆరిఫ్ వాపోయారు. సీఎం వాహనం వెళ్తుంటే ఇలా అసలు జరిగేది కాదని అలాంటిది తన కాన్వాయ్ వద్దకు విద్యార్ధులకు చెందిన కార్లు వచ్చి ఆగాయంటే దానర్ధం సీఎంకు తనపై కోపం ఉన్నట్లే అని ఆరిఫ్ చెప్తున్నారు. రాజకీయ మనస్పర్ధలు ఇలాంటి దాడులకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను కారు నుంచి దిగగానే ఆ విద్యార్ధులు ఎందుకు పారిపోయారు అని ఆరిఫ్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని పోలీసులకు కూడా ముందే తెలుసని కానీ పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేస్తే పాపం పోలీసులు ఆయన చెప్పినట్లు వినక ఏం చేస్తారని అంటున్నారు. విజయన్ కేరళలోకి హమాస్ ఉగ్రవాదులను రానిస్తున్నారని..దీనిని నవ కేరళం అని ఎలా అంటారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు.