5 Guarantees: తెల్ల రేషన్ కార్డు లేనివారి పరిస్థితి ఏంటి?
5 Guarantees: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఒక హామీ నెరవేర్చేసారు. మహిళలకు తెలంగాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇక మిగిలిన ఐదు గ్యారెంటీల గురించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఇవి వర్తిస్తాయని తెలిపారు. అన్ని హామీలకు ఒకే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఆఫీసుల్లో ఈ దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 90 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అర్జీ పెట్టుకున్నారు. దరఖాస్తులో అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉంటే అధికారులు ఓ రసీదు ఇస్తారు. ఈ రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మరి ఈ ఐదు హామీలకు అర్హులైనప్పటికీ తెల్ల రేషన్ కార్డులు లేకపోతే ఏంటి పరిస్థితి? దరఖాస్తులో కచ్చితంగా రేషన్ కార్డు నెంబరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదు అని దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులో వివరాలన్నీ నమోదు చేసాక కొన్ని ఐడీ ప్రూఫ్‌లను కూడా చూపించాల్సి ఉంటుంది. అవేంటంటే..
ఆధార్ కార్డు జిరాక్స్
విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్
గ్యాస్ కనెక్షన్ నెంబర్
పట్టాదారు పాస్‌బుక్ నెంబర్
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే దరఖాస్తులో కచ్చితంగా ఇంటిపెద్దగా గృహిణి పేరునే రాయాలి.