Election Special: మెజారిటీ ఓట్లు నోటాకే ప‌డితే ఏమ‌వుతుంది?

Election Special: ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ‌కు ఫ‌లానా పార్టీ మంచి చేస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంటేనే ఆ పార్టీకి ఓటు వేస్తారు. కొంద‌రు మ‌న కులానికి చెందిన‌వాడే అని వారు మంచి చేసినా చేయ‌క‌పోయినా ఓట్లు వేసేస్తుంటారు. ఇంకొంద‌రైతే ఎవ‌రికో ఒక‌రికి వేసేస్తే ఒక ప‌ని అయిపోత‌ది అనుకుంటారు. ఇక నాలుగో ర‌కానికి చెందిన‌వారైతే.. ఏ పార్టీకి స‌పోర్ట్ చేయరు. వారు నోటాకే (NOTA) ఓటు వేసేస్తుంటారు.

సాధార‌ణంగా ఎన్నిక‌ల పోలింగ్ అయ్యాక ఏ పార్టీకి అయితే మెజారిటీ ఓట్లు ప‌డ‌తాయో వారే అధికారంలోకి వ‌స్తారు. ఒక‌వేళ రెండు పార్టీల‌కు మెజారిటీ ఓట్లు వ‌చ్చినా సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. దీనినే హంగ్ అంటారు. అంటే ఐదేళ్ల పాల‌నో రెండున్న‌రేళ్లు ఒక పార్టీ వారు అధికారంలో ఉంటే ఇంకో రెండున్న‌రేళ్లు మ‌రో పార్టీ వారు ఉంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు తెలిసిన అంశాలే. కానీ ఓ రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా నోటాకే ఓటు వేస్తే ఏంటి ప‌రిస్థితి? అంటే 100 శాతంలో 60 శాతం ఓట్లు నోటాకు మిగ‌తా 40 శాతం ఇత‌ర పార్టీల‌కు ఓట్లు ప‌డితే ఏమ‌వుతుంది? ఇలాగైతే అసలు ఎప్పుడూ మ‌న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జ‌ర‌గ‌లేదనుకోండి. ఒక‌వేళ మెజారిటీ ఓట్లు నోటాకు ప‌డితే ఏమ‌వుతుందో తెలుసుకుందాం. (election special)

ఒక‌వేళ మెజారిటీ ఓట్లు నోటాకే పడితే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అది కూడా బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల‌తో కాకుండా కొత్త అభ్య‌ర్ధుల‌ను పెట్టి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల్లో ఏ ఒక్కరికి నోటా ప‌డినా.. మ‌రో అభ్య‌ర్ధిని విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. అయితే పార్టీల పాల‌సీలు న‌చ్చ‌నివారు మాత్ర‌మే నోటాకు ఓటు వేస్తార‌ని అన‌డానికి లేదు. కొంద‌రికి అస‌లు పార్టీలు ఎలా ప‌ని చేస్తాయి.. ఏ అభ్య‌ర్ధి ఎలాంటివారు అనే విష‌యాలు తెలీవు. ఇలా ఎన్నిక‌ల గురించి అవ‌గాహ‌న లేనివారు ఎవ‌రో చెప్పారు కాబ‌ట్టి ఓటు వేయ‌డానికి వెళ్లి నోటాకు వేస్తుంటారు. ఇలాంటి ఓట్ల‌ను అస‌లు ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోదు. మెజారిటీ ఓటర్లు నోటాకే వేస్తే అప్పుడు వారికి ఏం కావాలో తెలుసుకుని దానికి త‌గ్గ‌ట్టు మార్పులు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు.