Exit Poll: హంగ్‌ అసెంబ్లీ దిశగా కర్నాటక ఎగ్జిట్‌ పోల్స్‌.. కింగ్‌ ఎవరంటే?

Bengaluru: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కలిపి.. 66 శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే ఇప్పటికే ఓటు వేయడానికి కేంద్రాల వద్ద అనేక మంది ఓటు వేసేందుకు వచ్చారు. వారు కూడా ఓటు వేసిన తర్వాత పోలింగ్‌ ముగియనుంది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీల మధ్యే పోటీ జరిగింది. కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 113 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇవాళ పోలింగ్‌ ముగిసిన వెంటనే కొన్ని సర్వే, మీడియా, ఇతర ఏజెన్సీలు… ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను విడుదల చేశాయి. వాటి నివేదికల ప్రకారం.. మరోసారి కర్నాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో జేడీఎస్ కింగ్‌ మేకర్‌ కానుంది… అయితే.. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను సైతం తమ వైపు తిప్పుకునే అవకాశం లేకపోలేదు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ :

ఆత్మ సాక్షి సర్వే :
బీజేపీ : 83 – 94
కాంగ్రెస్ : 117 – 124
జేడీఎస్ : 23 – 30
ఇతరులు : 02 – 08

పీపుల్స్ పల్స్ సర్వే :
బీజేపీ : 78 – 90
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 29
ఇతరులు : 01 – 03

రిపబ్లిక్ టీవీ సర్వే :
బీజేపీ : 85 – 100
కాంగ్రెస్ : 94 – 108
జేడీఎస్ : 24 – 31
ఇతరులు : 02 – 06

జన్ కీ బాత్ సర్వే :
బీజేపీ : 94 – 117
కాంగ్రెస్ : 91 – 103
జేడీఎస్ : 14 – 24
ఇతరులు : 0 – 4

పొలిటికల్ ల్యాబరేటరీ సర్వే :
బీజేపీ : 80
కాంగ్రెస్ : 108
జేడీఎస్ : 32
ఇతరులు : 04

ఇండియా టుడే సర్వే :
బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 17 – 20
ఇతరులు : 0 – 3

ఏబీపీ – సీ ఓటర్ సర్వే :
బీజేపీ : 74 – 86
కాంగ్రెస్ : 107 – 119
జేడీఎస్ : 23 – 35

జీ న్యూస్ సర్వే :
బీజేపీ : 103 – 115
కాంగ్రెస్ : 79 – 91
జేడీఎస్ : 26 – 36

జీ మ్యాట్రిస్ సర్వే:
బీజేపీ- 79 -94
కాంగ్రెస్- 103 – 118
జేడీఎస్- 25- 33

టైమ్స్ నౌ సర్వే :
బీజేపీ 114
కాంగ్రెస్ 86
జేడీయూ 21
ఇతరులు 3