Budget 2024: సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? తగ్గేవి పెరిగేవి ఏవి?
Budget 2024: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పెరిగేవి తగ్గేవి ఏంటి? వంటి అంశాలను తెలుసుకుందాం.
2019 నుంచి 2023 వరకు చూసుకుంటే పెరిగిన, తగ్గిన ధరలు ఇలా ఉన్నాయ్
బడ్జెట్ 2023-2024
తగ్గినవి – టీవీలు, స్మార్ట్ ఫోన్స్, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఆహారం, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, ఈవీలకు బ్యాటరీలను తయారుచేసేందుకు ఉపయోగించే లిథియం ఇయాన్ మెషినరీ (Budget 2024)
పెరిగినవి – సిగరెట్లు, సైకిళ్లు, ఇమిటేషన్ ఆభరణాలు, విమాన ప్రయాణాలు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, కాపర్ స్క్రాప్, టెక్స్‌టైల్స్
బడ్జెట్ 2022-2023
తగ్గినవి – ఇమిటేషన్ ఆభరణాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, జాతి రత్నాలు
పెరిగినవి – గొడుగులు, దిగుమతి చేసిన వస్తువులు, అన్‌బ్లెండెడ్ చమురు, చాక్లెట్లు, స్మార్ట్ వాచీలు వాటి ఇయర్ బడ్స్
బడ్జెట్ 2021-2022
తగ్గినవి – బంగారం, వెండి, లెదర్ వస్తువులు, నైలాన్ దుస్తులు, ఐరన్, స్టీల్, కాపర్ నుంచి తయారుచేసిన వస్తువులు
పెరిగినవి – సోలార్ సెల్స్, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, దిగుమతి చేసిన జాతిరత్నాలు, రాళ్లు, ఇంపోర్టెడ్ ఏసీ, ఫ్రిడ్జ్ కంప్రెసర్లు, ఇంపోర్టెడ్ ఆటో పార్ట్స్ (Budget 2024)
బడ్జెట్ 2020-2021
తగ్గినవి – రా చెక్కర, స్కిమ్డ్ పాలు, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్, ఆల్కహాలిక్ డ్రింక్స్, ఆగ్రో-యానిమల్ ఆధారిత ఉత్పత్తులు, న్యూస్‌ప్రింట్‌కి కావాల్సిన వస్తువులు, తేలికపాటి, కోటెడ్ పేపర్, ప్యూరిఫైడ్ టెలెఫ్తలిక్ యాసిడ్
పెరిగినవి – మెడికల్ పరికరాలు, చెప్పులు, ఫర్నీచర్, గోడ ఫ్యాన్లు, సిగరెట్లు, ఇతర తంబాకు ఉత్పత్తులు, క్లే ఐరన్, స్టీల్, కాపర్, సీవీ పార్ట్స్
బడ్జెట్ 2019-2020
తగ్గినవి – ఇళ్లు, సెట్ టాప్ బాక్సులు, దిగుమతి చేసుకున్న డిఫెన్స్ పరికరాలు, దిగుమతి చేసుకున్న ఈవీ పార్ట్స్, కెమెరా మాడ్యూల్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, ఆర్టిఫిషియల్ కిడ్నీలను రూపొందించడానికి కావాల్సిన సామాగ్రి, దిగుమతి చేసుకున్న ఉన్ని, ఉన్ని టాప్స్
పెరిగినవి – పెట్రోల్, డీజిల్, ఏడాదికి రూ.1 కోటి విత్‌డ్రా చేసుకున్నదానిపై ఫీజ్, ఫుల్లీ ఇంపోర్టెడ్ కార్లు, స్ప్లిట్ ఏసీలు, సిగరెట్లు, హుక్కా, తంబాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న ఆటో పార్ట్స్, దిగుమతి చేసుకున్న స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్టులు, ఇంపోర్టెడ్ గోల్డ్ ఇతర మెటల్స్, ఇంపోర్టెడ్ పేపర్, పేపర్ ఉత్పత్తులు, ఇంపోర్టెడ్ ప్లగ్స్, సాకెట్స్, స్విచ్‌లు, సీసీటీవీ కెమెరాలు, లౌడ్ స్పీకర్లు. (Budget 2024)
పూర్తి బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అప్పుడు ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.