Kavitha Arrest: 14 రోజులు జైల్లో…అస‌లు ఈడీ కోర్టుకు ఏం చెప్పింది?

Kavitha Arrest: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఢిల్లీలోని రౌజ్ కోర్టు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించింది. ఈ నేప‌థ్యంలో 14 రోజుల పాటు క‌విత‌ను తిహార్ జైల్లో ఉంచ‌నున్నారు. కోర్టు జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించ‌డానికి ఢిల్లీ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) అధికారులు ఏం చెప్పారు?

లిక్క‌ర్ స్కాంలో సౌత్ లాబీగా క‌విత వ్య‌వ‌హ‌రించార‌ని.. ఈ నేప‌థ్యంలో రూ.100 కోట్ల వ‌ర‌కు ఆమ్ ఆద్మీ పార్టీకి త‌ర‌లించార‌న‌డంలో ఏమాత్రం సందేహం లేద‌ని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇందుకు సాక్ష్యం వారు ఆధారాల‌ను ధ్వంసం చేయ‌డ‌మే అని కూడా నొక్కి చెప్పింది. మ‌రోపక్క ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వ‌డంతో వీరిద్ద‌రినీ క‌లిపి విచారిస్తే మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని కోర్టుకు అధికారులు చెప్ప‌డంతో జైలుకు త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఇక క‌విత పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌పై ఏప్రిల్ 1న విచార‌ణ జ‌ర‌గ‌నుంది.