Protem Speaker: ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి.. కాంగ్రెస్ ఒవైసీనే ఎందుకు నియమించింది?
Protem Speaker: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం మొదలైంది. గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా AIMIM నేత అక్బరుద్దిన ఒవైసీని (akbaruddin owaisi) నియమించింది.
ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి?
ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అసెంబ్లీలో ఓ స్పీకర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవర్ని ఎంచుకోవాలో తెలీని పక్షంలో తాత్కాలికంగా ప్రొటెం స్పీకర్‌ను ఎంపికచేస్తుంది. ఫుల్ టైం స్పీకర్‌ను నియమించాక ప్రొటెం స్పీకర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఒవైసీనే ఎందుకు?
ఒవైసీ AIMIM పార్టీ అయినప్పటికీ ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రొటెం స్పీకర్ అయినా స్పీకర్ అయినా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉండాలి. గెలిచినవారికి మాత్రమే ఈ పదవి దక్కుతుంది. ఓడిపోయిన వారిని స్పీకర్‌గా నియమించరు.