AP Elections: ప్రశాంత్ కిశోర్ సర్వే ఏం చెప్తోంది? జనసేనతో పొత్తు లేకపోతే ఔటా?
AP Elections: పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిశోర్ (prashant kishore) TDP అధినేత చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) కలవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో YSRCP కోసం పనిచేసిన ప్రశాంత్ ఇప్పుడు 2024లో తెలుగు దేశం- జనసేన పార్టీలను గెలిపించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐప్యాక్ ద్వారా చేయించిన సర్వే పేపర్లను ప్రశాంత్ చంద్రబాబుకు ఓ సీల్డ్ కవరులో వేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు దేశంకు సంబంధించిన గ్రూప్ చర్చల్లో నానుతున్న అంశాలేంటంటే..
*కుప్పంలో TDPకి పాజిటివ్ టాక్ ఉంది. కానీ జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించకపోతే అక్కడ ఓట్లు దొబ్బే అవకాశం ఎక్కువగా ఉంది.
*జనసేనతో పొత్తు లేకపోతే 30 నుంచి 35 సీట్ల వరకే పరిమితం అవ్వాల్సి వస్తుంది.
*జనసేనతో పొత్తు వల్ల 65-75 సీట్లలో మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.
*తెలుగు దేశం BJPతో జతకడితే జగన్‌కే లాభం.
*గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలను వీలైనన్ని ఎక్కువగా ఇస్తే పనవుతుంది.
*గోదావరి జిల్లాల్లో TDP కన్నా జనసేనకే ఎక్కువ అవకాశం.
*జగన్ సంక్షేమాల వల్ల అప్పులు పెరిగాయని ప్రచారం చేసినంత మాత్రాన ఓట్లు పడే అవకాశం లేదు.
*నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం. ఇందుకు ఆయన చేసిన యువగళం పాదయాత్రే కారణం.
*ముఖ్యమంత్రి స్థానంపై పదే పదే ప్రకటనల వల్ల ఓటు బదిలీ కష్టమవుతుంది.