President: టాప్ 50 యూనివ‌ర్సిటీల్లో ఒక్క భార‌తీయ వ‌ర్సిటీ లేదు

President: భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (draupadi murmu) IIT ఖ‌రగ్‌పూర్‌లో జ‌రిగిన 69వ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగిస్తూ.. ప్ర‌పంచంలోని టాప్ 50 విశ్వ విద్యాల‌యాల్లో భార‌త్ నుంచి ఒక్క యూనివ‌ర్సిటీ లేక‌పోవ‌డం బాధాక‌ర‌మని అన్నారు. ర్యాంకింగ్‌ల కంటే విద్యార్ధుల‌కు మంచి విద్య‌ను అందించ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని ఇప్పుడున్న విద్యా వ్య‌వ‌స్థ‌ను దుయ్య‌బ‌ట్టారు. IIT ఖ‌రగ్‌పూర్ భార‌త్‌లోని పురాత‌న విశ్వ‌విద్యాల‌యాల్లో ఒక‌టి కాబ‌ట్టి ప్ర‌పంచంలోని టాప్ 50లో చోటు సంపాదించేలా కృషి చేయాల‌ని సూచించారు.