బడ్జెట్లో తెలంగాణకు సున్నా.. మీ చెవులు పనిచేయడంలేదా?
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని.. ప్రభుత్వం చెవులు మూసుకుపోయాయా అని ఆయన ప్రశ్నించారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారు? KRMBకి రహస్యంగా సంతకాలు చేసేసి ప్రాజెక్ట్లు ఇచ్చేయడంతో పాటు ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకు సున్నా ఇచ్చిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా మౌనంగా వ్యవహరిస్తుండటం షాకింగ్ అంశం అని విమర్శించారు.