AP CID అడిగిన 10 ప్ర‌శ్న‌లు ఇవేనా..?!

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) జ్యుడిషియ‌న్ క‌స్ట‌డీలో ఉన్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) రెండు రోజుల పాటు త‌మ క‌స్ట‌డీలో ఉంచ‌నుంది AP CID. ఈరోజు ఉద‌యం 9:30 గంట‌ల స‌మ‌యంలో దాదాపు 9 మంది సీఐడి అధికారులు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు వెళ్లారు. వీరితో పాటు చంద్రబాబు నాయుడు త‌ర‌ఫు ఇద్ద‌రు లాయ‌ర్లకు కూడా అనుమ‌తి ఇచ్చారు. నేటి విచార‌ణ ముగిసింది. అయితే.. ఈరోజు చేసిన విచార‌ణ‌లో సీఐడి అధికారులు చంద్ర‌బాబుని దాదాపు 10 ప్ర‌శ్న‌లు అడిగార‌ట‌. ఆ ప్ర‌శ్న‌లు ఏంటంటే..

1. రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్ అని ఎలా నిర్ణ‌యించారు?

2. సీమెన్స్‌కి తెలీకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?

3. అగ్రిమెంట్ ఏ విధంగా జ‌రిగింది?

4. జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేసారు?

5. ఆర్థిక శాఖ అభ్యంత‌రాలు ప‌ట్టించుకోకుండా నిధులు రిలీజ్ చేయాల‌ని ఎందుకు ఒత్తిడి చేసారు?

6. 13 చోట్ల మీ సంత‌కాలే ఉన్నాయి. సంత‌కాలు పెట్టేసి అధికారుల‌పై ఒత్తిడి తేవాల్సిన అవ‌స‌రం ఏముంది?

7. డిజైన్ టెక్ కంపెనీకి త‌ర‌లించిన నిధుల గురించి మీకు తెలుసా?

8. నిధులు త‌ర‌లించిన మ‌నోజ్ పార్థ‌సార‌ధితో మీకున్న సంబంధం ఏంటి?

9. పెండ్యాల శ్రీనివాస్‌కి నిధులు అందిన విష‌యం మీకు తెలుసా?

10. AP CID నోటీసులు ఇవ్వ‌గానే వారెందుకు విదేశాల‌కు పారిపోయారు?

CID DIG ధ‌నుంజ‌యుడు ఆధ్వ‌ర్యంలో ఈ ఇంట‌రాగేష‌న్ జ‌రిగింది. ఉద‌యం రెండున్న‌ర గంట‌ల పాటు విచార‌ణ చేప‌ట్టాక లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ప్ర‌తి ఐదు నిమిషాల‌కు ఒక బ్రేక్ తీసుకుంటూనే ఉన్నారు. అయితే AP CID వేసిన ప‌ది ప్రశ్న‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కొన్నింటికి మాత్ర‌మే స‌మాధానం చెప్పార‌ట. మిగ‌తావాటికి తెలీదు.. గుర్తులేదు అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.