Alliance: ఆ గట్టు లేదు.. ఈ గట్టు లేదు..!
Hyderabad: దేశ రాజకీయాలు రెండుగా విడిపోయాయి. ఒకటి I-N-D-I-A. మరొకటి NDA . I-N-D-I-Aలో 26 పార్టీలు, NDAలో 39 పార్టీలు చేరిపోయాయి. అయితే ఏ కూటమిలోనూ కలవని పార్టీలు 11. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే.. TDP, BRS, YSRCP పార్టీలు ఏ కూటమిలోనూ చేరడానికి ఒప్పుకోవడంలేదు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటున్నాయి. (alliance)
BRSను తీసుకుంటే.. అసలు తెలుగు రాష్ట్రాల నుంచి BJPని తరిమికొట్టడానికి అపోజిషన్ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చిందే తెలంగాణ ముఖ్యమంత్రి KCR. అందుకే ఆయన TRSను కాస్తా BRSగా మార్చారు. బీజేపీకి గట్టి పోటీని ఇవ్వడానికి అటు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మీట్ పెట్టి BJPని తరిమి కొట్టాలని అనుకుంటున్న పార్టీలన్నీ మావైపు రండి అని ప్రకటించినా BRS పట్టించుకోలేదు. ఎందుకంటే.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ BRSకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఒకవేళ BJPని ఎదుర్కోవాలంటే ఒంటరిగానే సత్తా చాటుకుంటాం కానీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసింది. (alliance)
ఇక ఏపీలో TDP, YSRCP పోటాపోటీగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం YSRCPని తరిమికొట్టడానికి TDP, జనసేన కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం జనసేనాని పవన్ కళ్యాణ్, TDP అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడారు కూడా. ఆ తర్వాత చంద్రబాబు.. దిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. మీటింగ్ తర్వాత పొత్తు ఉందా లేదా అనేది మాత్రం TDP చెప్పనేలేదు. (alliance)
తీరా చూస్తే.. NDA నుంచి అనుకోకుండా జనసేనకు (janasena) పిలుపు వచ్చింది. తమ సపోర్ట్ ముందు నుంచీ TDPకి కాకుండా BJPకే ఉందని పవన్ అన్నారు. TDP కూడా తమతో కలిస్తే ఇంకా మంచిది అని కూడా పిలుపునిచ్చారు. TDP కూడా ఎప్పటినుంచో BJPతో పొత్తు పెట్టుకుంటే మంచిది అనే ఆలోచనలోనే ఉంది. కానీ BJPకి అది ఇష్టం లేదు.
ఇక మిగిలింది YSRCP. ముందు నుంచీ జగన్ BJPకి సపోర్ట్‌గానే నిలుస్తూ వచ్చారు. పలుమార్లు దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. YSRCP, BJP పొత్తు పెట్టుకున్నాయేమో అన్నట్లుగా వ్యవహరించాయి ఈ రెండు పార్టీలు. కానీ ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. మొన్న మోదీ, జేపీ నడ్డాలు ఏపీలో పర్యటించినప్పుడు ఏపీని YSRCP అప్పుల దిబ్బగా మార్చేసిందని, ఎక్కడలేని అవినీతి మొత్తం వైజాగ్‌లోనే ఉందని అనేసారు. దాంతో ఇక YSRCP, BJP పొత్తు పెట్టుకునే సమస్యే లేదు. ఎందుకంటే BJP… YSRCPని ఇంటికి పంపించేయడానికే జనసేనను తమతో కలుపుకుంది. సో జగన్‌కు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.