Jagan: ఢిల్లీలో చ‌ర్చ దీని గురించేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan) దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్కడ కేంద్ర మంత్రుల‌తో నిర్వ‌హించిన కీల‌క భేటీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్.. వారితో చ‌ర్చించిన అంశాలు ఇవే..!

రాష్ట్రంలో లెఫ్ట్ వింగ్ తీవ్ర‌వాదం పూర్తిగా త‌గ్గిపోయింద‌ని.. మావోయిస్టుల దాడులు గ‌తంలో పోలిస్తే ఇప్పుడు బాగా త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని కేంద్ర మంత్రుల‌తో చెప్పార‌ట‌. తీవ్ర‌వాదాన్ని, మావో దాడుల‌ను ఆపేందుకు రాష్ట్రం 40 ఏళ్లుగా పోరాడుతోంద‌ని దీని కోసం త‌న ప్ర‌భుత్వం కొన్ని ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ను తీసుకుంద‌ని వెల్ల‌డించారు. ఈ చ‌ర్య‌లో భాగంగా దాడులు ఎక్కువ‌గా జ‌రిగే ప్ర‌దేశాల్లో భారీ భ‌ద్ర‌త‌ను పెంచామ‌ని, దాడుల్లో ధ్వంసం అయిన ప్ర‌దేశాల‌ను బాగు చేయిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఇప్పుడు మావో దాడులు బాగా త‌గ్గిపోయాయ‌ని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ మెయింటైన్ చేయాలంటే కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయం కూడా అవ‌స‌ర‌మ‌ని వెల్ల‌డించారు. 2019లో ఏపీలో మావోయిస్టుల కేడ‌ర్ స‌భ్యులు 150 ఉంటే ఇప్పుడు అది 50కు త‌గ్గింద‌ని చెప్పారు. పేద‌రికం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య వ్య‌వ‌స్థ బాలేక‌పోవ‌డం, విద్య లేక‌పోవ‌డం వంటి అంశాలే తీవ్ర‌వాదానికి దారి తీస్తున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంట‌లు సాగు చేసుకునేలా వారికి భూములు కేటాయిస్తున్నాయ‌ని చెప్పారు. గిరిజ‌న ప్ర‌దేశాల్లో మ‌రిన్ని పాఠ‌శాల‌లు, హాస్పిట‌ల్స్, బ్యాంకులు ఏర్పాటుచేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. (jagan)