“నన్ను ఉరితీయండి కానీ రెజ్లింగ్ ఆపకండి”
Delhi: లైంగిక వేధింపుల కారణంగా రెజ్లర్లు(wrestlers) చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో చీఫ్ బ్రిష్ భూషణ్ సింగ్(brijbhushan sharan singh) కీలక వ్యాఖ్యలు చేసారు. కావాలంటే తనను ఉరితీయండి కానీ రెజ్లింగ్ మాత్రం ఆపకండి అంటూ మీడియా ముందు మాట్లాడారు. ఆందోళనల కారణంగా నాలుగు నెలలుగా రెజ్లింగ్ జరగడంలేదని కావాలంటే తనకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు కానీ రెజ్లింగ్ యాక్టివిటీ మాత్రం ఆపకండి అని రెజ్లర్లను రిక్వెస్ట్ చేసారు. రెజ్లింగ్ అకాడమీలో కొన్నేళ్లుగా తమ పట్ల బ్రిష్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వినేష్ ఫొగాట్, సాక్షి మాలిక్ వంటి ఇండియాకు చెందిన టాప్ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వీరికి సపోర్ట్‌గా భజరంగ్ పూనియా వంటి మగ రెజ్లర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా బ్రిష్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఏ నేరమూ చేయలేదని, ఎన్నికల ముందు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు రెజ్లర్ల చేత ఇలా చేయిస్తున్నారని బ్రిజ్ భూషణ్ అంటున్నారు. రోజూ అకాడెమీల జరిగే రెజ్లింగ్ యాక్టివిటీ ఒక్కసారిగా ఆగిపోతే ఛాంపియన్షిప్స్ జరగవని, కోటి ఆశలతో అకాడెమీకి వస్తున్న జూనియర్ రెజ్లర్ల భవిష్యత్తు డేంజర్లో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.