Vladimir Putin: రష్యా భారత్ మధ్య గొడవలు పెట్టలేరు
వెస్ట్రన్ దేశాలు భారత్ రష్యా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాయని అది వారి తరం కాదని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin). భారత ప్రభుత్వం తమ దేశ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి స్వతంత్రంగా పనిచేసుకుంటోందని.. కానీ కొన్ని వెస్ట్రన్ దేశాలు భారత్‌ను చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు. భారత్ ఆర్థికంగానూ బలపడుతోందని కొనియాడారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇతర దేశాలకు ప్రయాణించింది లేదని… ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన నేపథ్యంలో తనపై అంతర్జాతీయంగా అరెస్ట్ వారెంట్ జారీ అయిందని తెలిపారు. ఎక్కడికి వెళితే తనను అరెస్ట్ చేస్తారో ఆ దేశాలకు తాను వెళ్లడంలేదని తెలిపారు.