Revanth Reddy: కర్ణాటకలాగే తెలంగాణలోనూ గెలుస్తాం
Hyderabad: కర్ణాటకలో సులువగా గెలిచినట్లే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ గెలుస్తామని అన్నారు TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy). కాంగ్రెస్ విజయం కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాదని, తెలంగాణ అడ్డా కూడా తమదేనని ధీమా వ్యక్తం చేసారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలించి, విద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు దూరం పెట్టారని అన్నారు. బీజేపీని తరిమికొట్టినట్లుగానే.. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్దిచెప్తారని అన్నారు. రామయ్య, హనుమంతుడి పేర్లు చెప్పుకుని బీజేపీ గెలిచేద్దామనుకుందని, కానీ రామయ్యను అవమానించిన బీజేపీని హనుమంతుడు ఓడించాడని తెలిపారు. ఇక బీజేపీకి దక్షిణాదిలో చోటులేదని, బీజేపీని మోదీని ప్రజలు తరిమికొట్టారని పేర్కొన్నారు.