Venkat Reddy: అధికారంలోకి వచ్చాక హమీలు నెరవేర్చకపోతే తప్పుకుంటాం
Telangana Elections: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అలా చేయలేకపోతే KCR లాగా సొల్లు మాటలు చెప్పకుండా అధికారం నుంచి తప్పుకుంటామని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (venkat reddy). KCR పోటీ చేయనున్న కామారెడ్డిలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్ధిని ప్రకటించకపోవడంపై వెంకటరెడ్డి స్పందిస్తూ.. ఇంకా హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని.. హైకమాండ ఎవర్ని ఎంపికచేస్తే వారే పోటీ చేయాలని కాదు కూడదు అంటే కుదరదని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని BRS పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదని తెలిపారు.