Rachamallu: జ‌గ‌న్‌కి ఏమ‌న్నా అయితే మేం ఏమైపోవాలి?

we will become orphans if something happens to jagan says rachamallu

Rachamallu: జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఏమన్నా జ‌రిగితే మేం ఏమైపోవాలి అని ప్ర‌శ్నించారు వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి. ఆస్తి కోసం ష‌ర్మిళ సొంత అన్న‌ను బ‌జారుకీడ్చాల‌ని చూస్తోంద‌ని అన్నారు.

“” చంద్ర‌బాబు నాయుడు ష‌ర్మిళ అనే క‌త్తితో జ‌గ‌న్ త‌ల‌ను న‌ర‌కాల‌ని చూస్తున్నాడు. జ‌గ‌న్‌పై ఎన్ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నావ్ షర్మ‌ళ‌మ్మా నువ్వు? 2019 స‌మ‌యంలోనే నా బిడ్డ‌ను రాష్ట్రానికి అప్ప‌గిస్తున్నాను అని విజ‌య‌మ్మ ప్ర‌క‌టించారు. ఇక జ‌గ‌న్‌కు మీకు ఏ సంబంధం లేదు. జ‌గ‌న్ మా వాడు. మాకు మాత్ర‌మే సొంతం. జ‌గ‌న్‌ని ఏం చేయాలనుకుంటున్నారు? ష‌ర్మిళ జ‌గ‌న్ అంతాన్ని కోరుకుంటోంది. ఆయ‌న‌కు ఏమ‌న్నా అయితే మాతో పాటు కోటి కుటుంబాలు రోడ్డున ప‌డ‌తాయి. జ‌గ‌న్‌ను కాపాడుకునే బాధ్య‌త మాపై ఉంది “” అని మండిప‌డ్డారు.