KTR: అందుకే కిష‌న్ రెడ్డి పేరు BJP లిస్ట్‌లో లేదు

Telangana Elections: ఈరోజు bjp తెలంగాణ అభ్య‌ర్ధుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో bjp రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (kishan reddy) పేరు లేక‌పోవ‌డం ప‌లు అభిప్రాయాల‌కు దారితీస్తోంది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR స్పందిస్తూ.. పోటీ చేసే ధైర్యం లేక వెన్ను చూపించాడని గ‌తంలో రాజీనామా చేయ‌మంటే పారిపోయాడ‌ని అన్నారు.

BJPకి తెలంగాణ‌లోని 100 సీట్ల‌లో అస‌లు అభ్య‌ర్ధులే లేర‌ని తెలిపారు. ఈసారి కూడా విజ‌యం పార్టీదేన‌ని స‌ర్వేలు కూడా చెప్తున్నాయ‌ని.. ప్ర‌జ‌లు మూడ్ కూడా బాగుంద‌ని తెలిపారు. కాంగ్రెస్ (congress) నేతలు మ‌ర్యాద‌గా మాట్లాడ‌టం నేర్చుకోండి అంటున్నార‌ని ఆ పార్టీలోని స‌న్నాసులను చూసి మ్యాన‌ర్స్ నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం త‌మ‌కు లేద‌ని.. అన్ని సీట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిప‌డ్డారు. (KTR)