వైజాగ్‌లో ఎకరం అమ్మితే.. తెలంగాణలో 300 కొనుక్కోవచ్చు
AP: వైజాగ్‌లో ఎకరం అమ్మితే.. ఆ వచ్చిన డబ్బుతో తెలంగాణలో 300 ఎకరాలు కొనుక్కోవచ్చని అంటున్నారు YCP నేత గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath). మొన్న తెలంగాణ సీఎం KCR చేసిన కామెంట్స్‌కు అమర్నాథ్ బదులుగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఒకప్పుడు తెలంగాణను ఎదగనివ్వని వారే ఇప్పుడు తెలంగాణను తెగ పొగిడేస్తున్నారని, ఒకప్పుడు తెలంగాణలో భూముల విలువ చాలా తక్కువగా ఉండేదని ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణ బెస్ట్ అని KCR అన్నారు.
“KCR ఏ ఉద్దశంతో మాట్లాడారో తెలీదు కానీ.. హైదరాబాద్‌లో లేని రేట్లు వైజాగ్‌లో ఉన్నాయి. ఏపీలో డిమాండ్ ఉంది. ఒక్క హైదరాబాద్‌ను పట్టుకుని మొత్తం తెలంగాణలో భూముల విలువ బాగుంది అని ఎలా అంటున్నారో నాకు అర్థంకావడంలేదు. విజయవాడ, వైజాగ్, నర్సీపట్నంలోనూ రేట్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆయనకు కావాల్సిన రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సబబు కాదు. దయచేసి జాగ్రత్తగా మాట్లాడలని విన్నవించుకుంటున్నాం” అని అన్నారు.