Ponguleti: కాంగ్రెస్‌లో చేర‌డం వెనుక BJP ప్లాన్?

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు భార‌త రాష్ట్ర స‌మితి (BRS) నుంచి కాంగ్రెస్‌లో (Congress) చేరారు. ఖ‌మ్మంలో త‌న గెలుపు ప‌క్కా అని చెప్తూనే అవ‌లీల‌గా గెలిచేసారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం అనేది భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) వేసిన ప్లాన్ అని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచాక తన ఎమ్మెల్యేలతో భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వస్తా అని ముందే హామీ ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని గాదె ఇన్న‌య్య అనే రాజ‌కీయ విశ్లేష‌కుడు బ‌య‌ట‌పెట్టారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత పొంగులేటి మ‌రో ఏక‌నాథ్ శిందే అవుతార‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఏక‌నాథ్ శిందే కూడా మ‌హారాష్ట్ర‌లో ఇలాంటి రాజ‌కీయ‌మే చేసారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు ముందు శివ‌సేన నుంచి బ‌య‌టికి వ‌చ్చి శివ‌సేన ఫాక్ష‌న్ పేరుతో కొంద‌రు ఎమ్మెల్యేల స‌పోర్ట్‌తో విడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసారు. ఇప్పుడు పొంగులేటి కూడా ఏక‌నాథ్ శిందేలానే చేస్తార‌ని గాదె ఇన్న‌య్య అంటున్నారు.