Hamas: యుద్ధం గురించి హ‌మాస్ ముందే హెచ్చ‌రించిందా?

ఇజ్రాయెల్‌పై (israel) దాడులు చేయ‌బోతున్న‌ట్లు పాలెస్తీనాకు (palestine) చెందిన ఉగ్ర‌వాద సంస్థ హ‌మాస్ (hamas) ముందే ఆ దేశానికి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. హ‌మాస్ దాడుల‌కు పాల్ప‌డ‌టానికి మూడు రోజుల ముందే హెచ్చ‌రించింద‌ని.. కానీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని అధికార వ‌ర్గం తెలిపింద‌ని పేర్కొంది. ఇజ్రాయెల్ ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఈజిప్ట్ (egypt) ఏ త‌ర‌హాలో దాడులు జ‌ర‌గ‌బోతున్నాయో చెప్ప‌క‌పోవ‌డ‌మేన‌ని ఇజ్రాయెల్ మీడియా ఆరోప‌ణ‌లు చేస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు స్పందిస్తూ.. అదంతా అబ‌ద్ధ‌మ‌ని.. త‌మ‌కు ముంద‌స్తు స‌మాచారం లేద‌ని అంటున్నారు.

హెచ్చ‌రించిన మాట నిజ‌మే అంటున్న అమెరికా

మ‌రోప‌క్క అగ్ర‌రాజ్యం అమెరికా (america) కూడా ఇజ్రాయెల్‌ను త‌ప్ప‌బ‌డుతోంది. హ‌మాస్ (hamas) దాడులు చేయ‌బోతోంద‌ని ఈజిప్ట్‌కు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల హెచ్చ‌రిక వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే ఇజ్రాయెల్‌కు స‌మాచారం అంద‌జేసింద‌ని… కానీ ఏ ర‌కంగా ఈ స‌మాచారం ఇచ్చిందో మాత్రం తెలీద‌ని అమెరికా ఫారిన్ అఫైర్స్ క‌మిటీకి చెందిన రిప‌బ్లిక‌న్ నేత మైఖెల్ మెక్‌కాల్ తెలిపారు. (hamas)