Vladimir Putin: ఒక్కో మ‌హిళ 8 మంది పిల్ల‌ల్ని క‌నండి.. పుతిన్ ఆదేశం

Vladimir Putin: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశ మ‌హిళ‌ల‌కు ఆదేశాలు జారీ చేసారు. ఒక్కో మ‌హిళ 8 నుంచి 9 మంది పిల్ల‌ల్ని కనాల‌ని ఆదేశించారు. 1990ల నుంచి ర‌ష్యాలో సంతానోత్ప‌త్తి భారీగా ప‌డిపోతూ వ‌స్తోంది. అదీకాకుండా గ‌తేడాది ఉక్రెయిన్‌తో జ‌రిగిన యుద్ధం వ‌ల్ల ర‌ష్యాలో దాదాపు 3 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 820,000 నుంచి 920,000 మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.

దాంతో రానున్న ఏళ్ల‌లో ర‌ష్యాలో జ‌నాభాను పెంచుకోవ‌డంపైనే దృష్టిపెట్ట‌నున్న‌ట్లు పుతిన్ తెలిపారు. ర‌ష్యాలో చాలా కుటుంబాల్లో ఒక్కో మ‌హిళ ఐదు నుంచి ఆరుగురు పిల్ల‌ల్ని క‌నేవార‌ని.. అమ్మ‌మ్మ‌ల కాలంలో అయితే దాదాపు 10 మందిని క‌నేవార‌ని పుతిన్ గుర్తుచేసారు. ఇప్పుడు అదే సంప్ర‌దాయాన్ని కొనసాగించాల‌ని పెద్ద కుటుంబాలు అనేది ర‌ష్యాలో ఓ సంప్ర‌దాయం కావాల‌ని పిలుపునిచ్చారు.