White House: నీ పని నువ్వు చూస్కో.. మా ఎన్నికలతో నీకేం పని?
White House: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి అమెరికా వైట్ హౌస్ చురక అంటించింది. అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన మద్దతు కమలా హ్యారిస్‌కేనని పుతిన్ అన్నారు. ఆమె నువ్వు చాలా బాగుంటుందని కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ ప్రజా ప్రతినిధి అయిన జాన్ కిర్బీ వైట్ హౌస్ తరఫున స్పందిస్తూ.. పుతిన్ అమెరికా ఎన్నికల్లో వేలు పెట్టకుండా తన పని తాను చూసుకుంటే మంచిదని అన్నారు. గత అమెరికా ఎన్నికల్లోనూ రష్యా కలగజేసుకుందని అగ్రరాజ్యం ఆరోపించింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఫేస్‌బుక్ జో బైడెన్‌కు సంబంధించిన పోస్ట్‌ను బ్లాక్ చేసింది. దీని వెనుక పుతిన్ హస్తముందన్న ఆరోపణలు రావడంతో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ పుతిన్‌కు సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు.