Vladimir Putin: నేను యవ్వనంగా ఉండేందుకు మందులు కనిపెట్టండి..శాస్త్రవేత్తలకు అల్టిమేటం
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు తన ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు ఎప్పటికీ యవ్వనంగా ఉండేందుకు మందులు కనిపెట్టాలని రష్యాకు చెందిన శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపథ్యంలో రష్యా ఆరోగ్య శాఖ జూన్‌లోనే శాస్త్రవేత్తలకు లేఖ రాసింది. దాంతో శాస్త్రవేత్తలు ఇదేం డిమాండ్ రా బాబూ అని తలలు పట్టుకున్నారు.
ఎందుకంటే ఇలాంటి మందులు కనిపెట్టాలంటే సంవత్సరం రెండు సంవత్సరాల పని కూడా కాదు. దాదాపు పదేళ్లు పడుతుంది. అందులోనూ కోట్లల్లో పెట్టుబడులు పెట్టాలి. అందులోనూ ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో పుతిన్ నుంచి ఇలాంటి డిమాండ్ రావడం గమనార్హం. ప్రస్తుతం పుతిన్ వయసు 71 సంవత్సరాలు. ఆయన కేబినెట్‌లో ఉన్న సీనియర్లు కూడా దాదాపు 70ల్లో ఉన్నారు. దాంతో త్వరగా మందులు కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2016లో పుతిన్ యవ్వనంగా కనిపించేందుకు ట్యాబ్లెట్లు తయారు చేసే ఓ పరిశ్రమకు వెళ్లి చికిత్సలు తీసుకున్నారు.