Vladimir Putin: ఆట‌గాడివే.. ఆమెతో ర‌హ‌స్యంగా ఇద్ద‌రు పిల్లలు!

Vladimir Putin has 2 kids with gymnast

Vladimir Putin: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఎన్నో ప్ర‌పంచ దేశాల‌కు చెందిన మీడియా వ‌ర్గాలు నిఘా ఉంచాయి. ఎప్ప‌టిక‌ప్పుడు పుతిన్ ర‌హ‌స్య విష‌యాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. అలా ప్ర‌య‌త్నిస్తున్న త‌రుణంలోనే ఓ షాకింగ్ విష‌యం బ‌య‌టప‌డింది. పుతిన్ మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్ అలీ క‌బేవాతో ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను క‌న్నాడ‌ట‌. ఆ పిల్ల‌ల‌కు ఇవాన్, జూనియ‌ర్ వ్లాదిమిర్ అని పేర్లు పెట్టిన‌ట్లు ర‌ష్యాకు చెందిన ఇన్‌వెస్టిగేటివ్ జ‌ర్న‌లిజం రిపోర్టు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు పిల్ల‌లు త‌మ త‌ల్లితో క‌లిసి వాల్డాయ్ స‌ర‌స్సు స‌మీపంలో ర‌హ‌స్యంగా ఓ భ‌వ‌నంలో నివ‌సిస్తున్న‌ట్లు పేర్కొంది.

వారికి కూడా భారీగా క్రెమ్లిన్ సెక్యూరిటీ ఏర్పాటుచేసి ఇంట్లోనే స్కూల్ పెట్టించాడ‌ట‌. ఏం కావాల‌న్నా చేసి పెట్టేందుకు అన్ని స‌దుపాయాలు ఏర్పాటుచేసిన‌ట్లు ఆ రిపోర్ట్ వెల్ల‌డించింది. పుతిన్ వారి వ‌ద్ద‌కు కేవ‌లం అర్థ‌రాత్రి వేళ‌ల్లోనే వెళ్తున్నాడ‌ట‌. పిల్ల‌ల‌కు బ‌య‌టి ప్ర‌పంచం గురించి తెలీడానికి చెరో రెండు ఐప్యాడ్లు కొనిచ్చాడ‌ట‌. ఆ పిల్ల‌ల పుట్టిన‌తేదీలు ఎక్క‌డా కూడా ర‌ష్యా ప్ర‌భుత్వం డేటా బేస్‌లో లేవు. ఇవాన్ 2015లో స్విట్జ‌ర్లాండ్‌లో పుట్ట‌గా.. జూనియ‌ర్ వ్లాదిమిర్ 2019లో మాస్కోలో జ‌న్మించిన‌ట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒక‌వేళ వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాల‌న్నా ప్రైవేట్ విమానాల్లోనే ప్ర‌యాణిస్తార‌ట‌. పుతిన్ ఎప్పుడూ కూడా త‌న పిల్ల‌ల గురించి బ‌య‌టికి చెప్పింది లేదు. అయితే ఒక సంద‌ర్భంలో త‌న పిల్ల‌లు ఇద్ద‌రూ చైనీస్, ఇంగ్లీష్ నేర్చుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.