chandrababu: ఎన్నికల్లో గెలవడానికే వివేకాను హత్య చేశారు

kadapa: ”వివేకానందరెడ్డి మర్డర్ పెద్దకేస్ స్టడీ. హత్యలు చేయడం, కేసులు లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నవారిని ప్రజాకోర్టులో శిక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని” మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) అన్నారు. వివేకాను చంపినవారికి ఎప్పటికైనా శిక్షతప్పదని… బాబాయ్ ని చంపినవారు ప్రజల భవిష్యత్ కు ఆశాజ్యోతులా? హత్యచేసినవారిని విచారణకు పిలిస్తే శాంతియుత ర్యాలీలు చేస్తారా? మీరు చేయాల్సింది శవ ర్యాలీలు అంటూ ఆయన మండిపడ్డారు. జగనే రాష్ట్రానికి దరిద్రం అని.. ప్రజల పాలిట సైతాన్ అని విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న భూతం. ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్ల పేరుతో బొక్కుతున్నాడు అంటూ ఆరోపించారు. జగన్, అతని మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి రూ.4లక్షలకోట్లు, 4 ఏళ్లలో ప్రజలపై వేసిన పన్నుల భారం రూ.5లక్షల కోట్లు, చేసిన అప్పులు రూ.10లక్షల కోట్లు. ఈ సొమ్మంతా ఎవరిజేబుల్లోకి పోయింది. రాష్ట్రంలో అప్పులేని మనిషి, కుటుంబమే లేదు అని పేర్కొన్నారు.

‘రాష్ట్రంలో అప్పులేని మనిషి, కుటుంబం ఉందా? ప్రతిఒక్కరి జీవనప్రమాణాలు పడిపోయి, ప్రతి కుటుంబం అప్పులపాలైంది. మరోపక్క ఎటుచూసినా నేరాలు-ఘోరాలు. మాజీ ముఖ్యమంత్రి సోదరుడు వివేకానందరెడ్డిని ఏం చేశారు? ప్రపంచానికే ఈ వ్యవహారం ఒక పెద్ద మిస్టరీ. ఇలాంటి దారుణం ప్రపంచంలో ఎక్కడాజరిగి ఉండదు.హత్య జరిగిన నాడు గుండెపోటు అన్నారు. తరువాత రక్తపు వాంతులని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కూతురు పోస్ట్ మార్టమ్ చేయాలంటే, అక్కడి నుంచి నారాసుర రక్తచరిత్ర అని నాపై వేసి తప్పించుకోవాలని కుఠిల రాజకీయాలు చేశారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి నాకు నాన్నలేడు.. ఉన్నచిన్నాన్నను కూడా చంపేశారు అని నాటకాలు ఆడాడు. కోడికత్తి డ్రామా ఆడాడు. అంతా చేసి ఎన్నికల్లో గెలిచాక సీబీఐ విచారణ కావాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. వివేకా కూతురు మాత్రం రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు(chandrababu) తెలిపారు.