అవినాష్‌కు బెయిల్ ఇవ్వొద్దని పదేపదే కోరిన సీబీఐ!
hyderabad: వైఎస్ వివేకానందరెడ్డి హత్య(ys viveka murder case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(kadapa mp avinash reddy)కి సంబంధించి రెండు కీలక అంశాలపై ఇవాళ విచారణ జరుగుతోంది. అందులో ఒకటి ముందస్తు బెయిల్ కోసం కాగా.. రెండోది.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీబీఐ విచారణ. ఇప్పటికే హైకోర్టు(telangana high court)లో అవినాష్ వేసిన పిటిషన్(avinash petition)పై వాదనలు వినిపిస్తున్నారు. అవినాష్ తరపు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి (T Niranjan Reddy).. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌కుమార్ (CBI Lawyer Anil Kumar) వాదనలు వినిపిస్తున్నారు. అయితే.. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరించడం లేదని.. అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టును సీబీఐ తరపు న్యాయవాది కోరారు. “అవినాష్ ను విచారించి అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు. వివేకా హత్య కుట్ర అవినాష్ రెడ్డికి తెలుసు. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం. హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలుసుకోవాలి” అని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇక దీనిపై మరికొద్ది సేపట్లో స్పష్టత రానుంది.
వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. హైకోర్టులో వేసిన ఆయన పిటిషన్‌లోని అంశాలు ఇలా ఉన్నాయి. ”దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సీబీఐ చూస్తోంది. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సీబీఐ ఉంది. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చింది. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.. ఒక వేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలి’’ అని అవినాష్‌రెడ్డి అభ్యర్థించారు.