viveka murder case: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
Delhi: వైఎస్ వివేకా హత్య(viveka murder case) కేసుకు సంబంధించి ఇటీవల ఆయన కుమార్తె సునీత(sunitha) సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. ఇవాళ సుప్రీం కోర్టులో ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ జరగగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సునీత పిటిషన్‌పై పూర్తి స్థాయిలో సోమవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. అప్పటి వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని సీజేఐ పేర్కొంది.