viveka case: వ‌ర్మ‌ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవాళే!

vijayawada: ఆర్జీవి(రాంగోపాల్‌ వర్మ).. ఇదో ప్రత్యేకమైన జీవి అని అందరూ అంటుంటారు. రాంగోపాల్‌ వర్మ(ram gopal varma) ఏది చేసినా సెన్సేషనే.. ఇక పాలిటిక్స్‌, కరెంట్‌ ఇష్యూస్‌, సంచలనం సృష్టించిన నేరాలపై ఆయన పలు సినిమాలు తీసి.. తనకున్న కాంట్రవర్సీ పేరును కాపాడుకుంటూ వస్తున్నారు. అలా తాజాగా మరోసారి.. వార్తల్లోకి వచ్చారు. ‘నిజం’ అనే యూట్యూబ్‌ ఛానల్‌(nijam youtube channel)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఛానల్‌లో పెట్టే కంటెంట్‌ గురించి ఆయన ఇలా వివరించారు. ‘నిజం అనే ఛానల్‌ ద్వారా.. అబద్దం బట్టలు ఊడదీసి.. నిజం నగ్న స్వరూపం చూపుతాను. అబద్దం బతికితే.. నిజాన్ని చంపుతుంది.. అసలు నిజం ఎప్పటికీ చావదు.. చచ్చినట్టు నటిస్తుంది. కానీ కొందరు నిజాన్ని చంపేశామని.. జేజేలు కొడుతూ, షాంపెయిన్ తాగి డ్యాన్సులు ఆడుతుంటారు. అది ఎప్పుడో ఒకప్పుడు వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు పొడుస్తుంది. నిజాన్ని ఛేదించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్. ఎనాలసిస్, కొన్ని సర్కమ్‌స్టెన్సెస్‌, నిజం మీద ఏకాగ్రత పెట్టినప్పుడే.. అబద్దం నుంచి నిజాన్ని కాపాడవచ్చని” ఆర్జీవి తెలిపారు.

తన ఛానెల్‌లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా.. కరెంట్ ఇష్యూస్, సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీ, సెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ తదితరల అంశాల గురించి మాట్లాడతానని.. తనతోపాటు.. వక్తలను కూడా ఆహ్వానిస్తానని రామ్ చెప్పారు. కొంతమందిని తాను ఇంటర్వ్యూ చేస్తానని, కొంతమందిని స్వప్న(swapna) చేస్తుందని అన్నారు. నిజం ఛానెల్ ఫస్ట్ ఎపిసోడ్ వైఎస్ వివేకా హత్య వెనక ఉన్న నిజంలో అబద్దం ఉందా అన్న అంశంపై ఉంటుందని.. అది ఇవాళ(మంగళవారం).. సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుందని ఆర్జీవీ తెలిపారు. వివేకా మర్డర్ వెనక ఉన్న నిజంలోని అబద్దాలు, అబద్దం చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు.. అలా వాళ్లతో చెప్పించిన వాళ్ల వెనక ఉన్న అబద్దాలు బయటకు తీయడమే నిజం ఛానెల్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.