ఇద్దరం కలిసి జైలుకు వెళ్దాం.. అవినాష్‌ రెడ్డిపై దస్తగిరి ఫైర్‌!

kadapa: వివేకా హత్య కేసు(viveka murder case)లో అప్రూవర్‌గా మారిన దస్తగిరి(Dastagiri) ఉన్నట్టుండి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. కొన్నాళ్లుగా కనిపించకుండా పోయారని.. వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రెస్‌మీట్(press meet) పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు. తాను పులివెందులలోనే ఉన్నానని.. ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. తాను అప్రూవర్ గా మారినప్పుడు ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) తనను ఎందుకు  ప్రశ్నించలేదని అన్నారు. ‘ మీ దాకా రానంతవరకు దస్తగిరి మంచోడు..ఇప్పుడు చెడ్డోడిగా మారాడా?’ అని మండిపడ్డారు. ‘నిజం ఒప్పుకోవడం నేను చేసిన తప్పా.. మీరు చేయమంటేనే కదా ఆ హత్య చేశాను.. నా జీవితం బాగుపడుతుంది అని మీరు చెప్పిన మాటలు నమ్మి ఆ పని చేశానని’ ఆయన అన్నారు. సీబీఐ విచారణ సవ్యంగా జరిగితే తనతోపాటే అవినాష్‌ జైలుకు వెళ్లడం ఖాయమని పరోక్షంగా దస్తగిరి తెలిపారు. తాను సునీతమ్మ , సిబిఐ వద్ద ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదని.. ఒకవేళ తీసుకున్నట్లు నిరూపిస్తే.. జీవిత కాలం జైలులో ఉండటానికి తాను సిద్దమేనని పేర్కొన్నారు.

ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై ఇంటి వద్ద ఉంటున్నారు దస్తగిరి. ఈనేపథ్యంలో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తనకు ప్రాణహాని ఉందని చెబుతూనే పలు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని.. తెలిపారు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకొచ్చిన దస్తగిరి వివేకా హత్యకేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలలనున్నాయని, నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని చెప్పుకొచ్చారు. ఇంతకాలం దస్తగిరి చెప్పినదంతా అబద్దమని అని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇకపై తెలుస్తాయన్నారు. ఈ కేసు విచారణకు సీఎం జగన్ (cm jagan) సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తయ్యేదని దస్తగిరి చెప్పుకొచ్చారు.