viveka murder case: దూకుడుగా సీబీఐ.. కీలక ఆధారాల సేకరణ

vijayawada: కడప(kadapa) మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(vivekananda reddy murder case) హత్య కేసులో సీబీఐ(cbi) దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు(supreme court) ఇచ్చిన గడువు మరో 15 రోజుల్లో ముగియనుండటంతో.. ఒక్కొక్కటిగా వివరాలు రాబట్లే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో ఘటన జరిగిన రోజున, అంతకు ముందు.. ఈ కేసులో అనుమానితులు, నిందితులుగా ఉన్న వారు ఎవరి ఇళ్ల వద్ద ఉన్నారు. ఎవరెవరిని కలిశారు అనే వివరాలను సాంకేతికతను ఉపయోగించుకుని ఆధారాలను రాబడుతున్నారు. ఇక నిన్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి(mp avinash reddy) అనుచరుడు.. ఉదయ్ కుమార్‌(udhay kumar reddy)ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతని రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలను అధికారులు ప్రస్తావించారు. ఉదయ్, శివశంకర్, అవినాష్ ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని సీబీఐ చెబుతోంది. హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లాడని.. ఈ సమాచారం.. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్‌లో ఉందన్నారు.

ముందు నుంచే ఉదయ్‌కుమార్‌ రెడ్డికి.. ఎంపీ అవినాష్‌ రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని సీబీఐ అధికారులు చెబుతున్నారు. హత్య జరిగిన రోజున ఉదయ్‌ తన తండ్రి ప్రకాష్ రెడ్డి(prakash reddy)తో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని.. వివేకా చనిపోయాడు అని తెలిసే వరకూ అవినాష్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఇద్దరూ.. ఒకేచోట ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. వివేకా మృతి చెందాడని వార్త తెలియగానే అవినాష్ రెడ్డి, ఉదయ్, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని.. బాత్రూం నుంచి డెడ్ బాడీని బెడ్ రూమ్‌కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చారు. గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసి.. దాన్ని గుండెపోటు అని చిత్రీకరించడంలో వీరి పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు. పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన అధికారులు.. విచారణకు సహకరించడం లేదు. ఇక అతను పారిపోతాడు అన్న అనుమానంతో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు.