Vivek Ramaswamy: ట్రంప్‌పై వేటును తొలగించండి.. లేదంటే నేను కూడా తప్పుకుంటా
Vivek Ramaswamy: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (donald trump) కొలరాడోలోని సుప్రీంకోర్టు వేటు వేసింది. 2021లో అమెరికా భవనంపై దాడికి సంబంధించిన కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువడించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీల్లేదని కోర్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్రంప్‌పై వేసిన వేటును తొలగించాలని లేదంటే కొలరాడో GOP ప్రైమరీ బ్యాలెట్ నుంచి విత్‌డ్రా చేసుకుంటానని తెలిపారు. ఈ మేరకు నిక్కీ హేలీతో పాటు ఇతర వ్యక్తులు కూడా తప్పుకోవాలని నిరసన వ్యక్తం చేసారు. ట్రంప్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమెరికాలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వివేక్ రామస్వామి హెచ్చరించారు.