Vinesh Phogat: ఎన్నిక‌ల్లో గెలిచిన వినేష్ ఫోగాట్

vinesh phogat won in haryana elections

Vinesh Phogat: భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగాట్ హ‌ర్యాణా ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వంతో వినేష్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పేసారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి జులానా సీటు టికెట్ ద‌క్కించుకున్నారు. ఈ సీటు నుంచి పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించారు. 6 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో వినేష్ గెలుపొందారు.