Vijayashanthi: రాముల‌మ్మ‌కు రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్

Telangana Elections: రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు BJP అవ‌కాశం ఇవ్వ‌క‌పోవడంతో రాముల‌మ్మ (vijayashanthi) అలిగారు. ఆమె చూపు ప్ర‌స్తుతం కాంగ్రెస్ వైపు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసి కాంగ్రెస్ కూడా తెలివిగా పావులు క‌దుపుతోంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) ఆల్రెడీ విజ‌య‌శాంతికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. కాంగ్రెస్‌లో చేరితే మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఇస్తామ‌ని అన్నార‌ట‌. రేవంత్ ఇచ్చిన ఆఫ‌ర్‌పై ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు విజ‌య‌శాంతి.